కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 13 ; కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్వర్గీయ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127 జయంతి వేడుకలు నేడు శనివారం ప్రేమల గార్డెన్ లో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించబడునని , ముందుగా పది గంటలకు బస్సుస్టాండ్ దగ్గర గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహమునకు పూలమాల అలంకరనా కార్యక్రమం ఉంటుందని . తరువాత పది గంటల ముప్పై నిమిషాలకు ప్రేమలో గార్డెన్స్లో నిర్వహించు కార్యక్రమానికి జిల్లాలోని అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు సంఘ నాయకులు మరియు ప్రజ లందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment