Monday, 30 April 2018

ఏప్రిల్ నెలలో బెల్లంపల్లి ఏరియా 92 శాతం బొగ్గు  ఉత్పత్తి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; బెల్లంపల్లి ఏరియాలో ఏప్రిల్ నెలకు గాను తొంభై మూడు శాతం ఉత్పత్తిని సాధించినట్టు ఏరియా  ఇంచార్జి జనరల్ మేనేజర్ కొండయ్య తెలిపారు. సోమవారం రెబ్బెన మండలం    గోలేటి  జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల  సమావేశంలో అయన ఉత్పత్తి వివరాలను తెలిపారు.  ఏప్రిల్ నెలకు గాను. ఏరియాకు నిర్దేశించి నిన 6,10,000 టన్నుల బొగ్గు  ఉత్పత్తికి గాను,5,61,857 టన్నుల ఉత్పత్తి తో 92 శాతం సాధించినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ 70మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా బెల్లంపల్లి ఏరియాకు 70లక్షల టన్నుల లక్ష్యాన్ని ఏర్పాటుచేసిందన్నారు. సంస్థ వార్షిక లక్ష్యంలో బెల్లంపల్లి ఏరియా 10 శాతం ఉత్పత్తిని సాధించాల్సి ఉంటుందన్నారు.ఏప్రిల్ నెలలో ఖైరిగూడ ఓసిపి 2,58,688 టన్నులు, బెల్లంపల్లి ఒసిపి 2 ఎక్స్టెన్షన్ 1,02,531 టన్నులు,డోర్లి -1ఓసిపి 2,00638,టన్నుల ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ తో పోలిస్తే ఈసారి రెండు శాతం ఉత్పత్తి తగ్గినట్లు తెలిపారు.అదేవిదంగా 17 శాతం బొగ్గు డిస్ ప్యాచ్లు తగ్గినట్లు తెలిపారు.ఏప్రిల్ నెలలో 190 ర్యాక్స్  బొగ్గును సరఫరా చేశామన్నారు. ఇటీవలే గోలేటి సి హెచ్ పి పూర్తి స్థాయి  ప్రారంభం కావడంతో  మరింత ఎక్కువ  బొగ్గు సరఫరా  సాధిస్తామన్నారు. వినియోగదారులకు 100 శాతం సరఫరా  లక్షంగా పని  చేస్తామన్నారు. ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గడిచిన నెలలో ఏర్పడిన ఉత్పత్తి లోటును వచ్చే నెలలో అధిగమిస్తామన్నారు. టెక్నీషన్లు, ఫిట్టర్లు కొరత కొంత ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నారు. మే  నెలకు గాను వార్షిక లక్ష్యాన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అదేవిదంగా కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు,చల్లని నీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు ఈ  సమావేశంలో ఎస్వోటూ జీఎం శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ కిరణ్ ,డీవైపీఎం రాజేశ్వర్, ఐఈడీ ఎస్ ఈ యోహాన్  తదితులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment