Sunday, 8 April 2018

ప్రత్యేక తెలంగాణ రాష్టం ఆవిర్భావంలో అమరులపాత్ర ఎంతో కీలకం


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 8 ; ప్రత్యేక తెలంగాణ రాష్టం ఆవిర్భావంలో అమరులపాత్ర  ఎంతో   కీలకం అని   ఎమ్మెల్సీ పురాణం సతీష్,  ఎమ్మెల్యే కోవలక్ష్మిలు  ఆన్నారు. మండల కేంద్రానికి చెందిన తెలంగాణ అమరవీరుడు తాళ్లపెల్లి వేణు కుమార్ గౌడ్ ఆరవ వర్ధంతి వేడుకలకు  ఆదివారం తాళ్లపల్లి ప్రభాకర్ గౌడ్ ఇంటి వద్ద నిర్వహించిన  కార్యక్రమానికి హాజరై వేణు కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మ బలిదానం చేసిన అమరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన వేణు కుమార్ గౌడ్ త్యాగం వృథా కాలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాకా తెలంగాణ ప్రభుత్వం  అమరుల కుటుంబాలకు  ఇంటికో ఉద్యోగంతో పాటు ఆర్థిక సహాయం అందించి ఆదుకుందన్నారు. సిఎం కెసిఆర్ అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని అన్నారు. అమరుల  త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాధం సంజీవ్ కుమార్, వైస్ ఎంపిపి గొడిసెల రేణుక, సర్పంచ్ పేసరు వెంకటమ్మ, తెరాస మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్రెడ్డి, ఉప సర్పంచ్  శ్రీధర్ నాయకులు సుదర్శన్ గౌడ్, మడ్డి శ్రీనివాస్ గౌడ్, చిరంజీవి గౌడ్, సర్వేశ్వర్ గౌడ్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment