కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; కాంట్రాక్ట్ కార్మికులకు పని వేళలు మారుస్తూ ఎండవేడికి ఉపశమనం కోసం మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్ల అందజేయాలని ఏఐటీయూసీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ఉప అధ్యక్షుడు బోగే ఉపేందర్ సోమవారం ఎస్వోటూ జీఎం శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం ఎండాకాలంలో ఎండతీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో కార్మికులు పని చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని వారి కోసం పనివేళలను మారుస్తూ మజ్జిగ ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని అన్నారు . ఈ కార్యక్రమంలో సాగర్ గౌడ్, రామ్ కుమార్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 30 April 2018
కార్మికులకు మజ్జిగ మరియు ఓఆర్ఎస్ పాకెట్స్ అందచేయాలి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment