.
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) (జైనూర్) ఏప్రిల్ 6 ; ఉపాధి హామీ పనులు చేసే కూలీలు దినసరి కూలి డబ్బులు వచ్చే విదంగా పని చేయాలనీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు షేక్ రషీద్ ఉపాధి హామీ కూలీలకు .శుక్రవారం సూచించారు మండలంలోని గౌరి కొలం గూడ గ్రామపంచాయతీ పరిధిలోని లెండిగూడ గ్రామశివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల ప్రభావం అధికంగా ఉండటం వల్ల కూలీలకు బోనస్ కింద అదనపు డబ్బులు కూడా అందించడం జరుగుతుందని అన్నారు ఉదయం ఎండ తీవ్రత అధికం కాక ముందే పనులు చేయడం సులభతరం అవుతుంది అన్నారు. ఉపాధి హామీ కూలీలు నామమాత్రానికి వచ్చి పనులు చేయొద్దని దినసరి కూలి పడేలా పనులు చేస్తే ఆర్థికంగా లబ్ధి పొందుతారని అన్నారు.కూలీ డబ్బుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని పనులు జరుగుతున్న చోట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో పాటు .తాగునీటి వసతి కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా టెక్నికల్ అస్టెంట్ ఆక్యానాయక్,ఎఫ్ఏ ఆత్రం రాజు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment