Sunday, 1 April 2018

బి.సి. సబ్సిడి రుణాల దరఖాస్తు తేదీని పొడిగించాలి: బోగే ఉపేందర్

 కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 1 ; రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బి.సి. సబ్సిడి రుణాల దరఖాస్తు తేదిని పొడిగించాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ ఒక  ప్రకటనలో  డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి బిసిలకు రుణాలు మంజూరు చేయలేదని,  వారం రోజుల క్రితం అధికారులు ఏప్రిల్ 4వ తేది లోపు దరఖాస్తు చేసుకొవాలని తెలిపారని కానీ కులం మరియు ఆదాయం దృవీకరణ పత్రాలు జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులకు పత్రాలు అందడం లేదని అన్నారు. దృవీకరణ పత్రాలు లేకపోవడంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోలేకపొతున్నారని అన్నారు. కావున అధికారులు స్పందించి దరఖాస్తు గడువును పొడిగించాలని, సకాలంలో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని కొరారు.

No comments:

Post a Comment