కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 25 ;: బెల్లంపల్లి ఏరియా సొంగరేణి WPS &GA ఆధ్వర్యంలో 2018-2019 సంవత్సరానికి గాను సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏరియా డిజియం పర్సనల్ జె కిరణ్ కుమార్ తెలిపారు. గోలేటి బీమన్న స్టేడియం లో ఫుట్ బాల్, వాలీబాల్ క్యాంప్ కోచింగ్ కై నిర్వహించడం జరుగుతుంది అన్నారు. అలాగే మాధారం టౌన్ షిప్ స్టేడియం లో అథ్లెటిక్ కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కోచింగ్ క్యాంప్ 26/04/2018 నుండి 20/05/2018 వరకు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక పిల్లలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆసక్తిగల వారు తమ దరఖాస్తులు జియం ఆఫీస్ లోని పర్సనల్ డిపార్ట్మెంట్ నందు అందజేయాలని తెలిపారు.
No comments:
Post a Comment