Tuesday, 24 April 2018

చికిత్స పొందుతున్న మహిళ మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; రెబ్బెన మండలంలో  రేకులుగూడలో  సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని తీవ్రంగా గాయపడిన కొమరం కమలాబాయి(35) అనే మహిళ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి కిరోసిన్ దీపం చేత పట్టుకుని కోళ్లను గూటిలో కమ్మే ప్రయత్నం  చేస్తుండగా కోడి ఎగిరి తన్నడంతో దీపం ఒలికి  కమలాబాయి పడింది. దీంతో కమలాబాయి తివ్రంగా గాయపడింది దాంతో స్థానికులు హుటాహుటిన 108లో  బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త బాపు ఒక కుమారుడు ఉన్నారు.

No comments:

Post a Comment