కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్10 ; జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవాలని జిల్లాను ఓడీఎస్ గా మార్చాలని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఇప్పటి వరకు ఏఒక్క మండలం కూడా పూర్తికాలేదని డీఆర్డీఏ పీడీ అన్నారు. మంగళవారం మరుగుడ్ల నిర్మాణం వాడకంపై సర్పంచులు అధికారుల తో స్థానిక ప్రేమల గార్డెన్లో డీఆర్డి ఓ పీ డి వెంకట ఓడి గంగాధర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు . జిల్లాలోని అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవాలని జిల్లాను ఓడీఎస్ గా మార్చాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్ని గ్రామాలను పర్యటిస్తూ గ్రామ ప్రజలు అవగాహన కల్పిస్తున్నప్పటికి ఇప్పటి వరకు ఏఒక్క మండలం కూడా పూర్తికాలేదని డీఆర్డీఏ పీడీ అన్నారు. వెనుకబడిన జిల్లాగా పేరొందిన కొమురంభీం జిల్లా నిజంగానే వెనుకబడిన జిల్లాగా నిరూపించు కోవద్దని గ్రామాల్లో జిల్లా పాలనాధికారి తోపాటు అధికారులు ఎంపిడివోలు తదితర పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎంపిడిఓ గ్రామం సర్పంచులతో సెక్రెటరీలతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏ మండలం కూడా పూర్తిస్థాయి ఓ డి ఎఫ్ గ మారలేదన్నారు. మొత్తం 12 మండలాల్లో 38 గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మూలన సమాచారం పూర్తి కావాల్సిఉందని ఆ గ్రామాలను పూర్తి స్థాయి ఓడీఎస్ గా మార్చాలన్నారు. అన్ని మండలాల్లో వివిధ దశల్లో పనులు ఉన్నాయని ఈ నెల 28 లోపు అన్ని 38 గ్రామాల్లో మరుగు దొడ్లు నిర్మించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎపిడిభావన ఋషి, రామకృష్ణ, ప్రశాంత్ ,ఎంపిడివోలు, అధికారులు, సర్పంచులు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment