కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ; రెబ్బెన మండలం నంబాల గ్రామంలో స్థానికంగా ఉన్న చెరువును వచ్చే వర్షాకాలంలో చేపల పెంపకానికి అనువుగా చేయడానికి అభివృద్ధిపనులను నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల పూడిక పనులను ప్రారంభించారు. ఈ పనులను ఉపాధి హామీ పనులలో భాగంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు చాపల పెంపకం కై రెండు మీటర్ల లోతుతో 20/20 మీటర్ల వెడల్పుతో ఈ పనులను చేపట్టడంజరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ గజ్జెల సత్యనారాయణ,ఇజిఎస్,టిఏ,ఎఫ్ఏ మరియు ఉపాధి హామీ కూలీలు రామయ్య, మల్లేష్ శాంకరి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment