వేధింపులు తాళలేక భర్తను హత్య చేసిన భార్య
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 2 ; రెబ్బెన మండలం లోని నారాయణ పూర్ గ్రామానికి చెందిన పొత్రాజుల కిష్టయ్య ను భార్య మల్లక్క వేధింపులు తాళలేక హతమార్చినట్లు సిఐ పురుషోత్తం తెలిపారు. మద్యానికి బానిసగా మారిన కిష్టయ్య ప్రతిరోజు భార్యను మానసికంగా శారీరకంగా వేధించేవాడు. ఆదివారం తాగిన మైకంలో ఇంటి ముందు ఉన్న మురికికాలువలో పడటంతో తలకు తీవ్ర గాయం అయింది.దాంతో కిష్టయ్యను ఇంట్లోకి తీసుకువెళ్లిన మల్లక్క కూతుళ్ళ సహాయం తో మెడ నులిమి హత్య చేసిందని, ఈ మేరకు సంఘటన స్థలం లో విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యప్తు న్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment