Saturday, 14 April 2018

భూ వివాదం దాడిలో ముగ్గురి అరెస్ట్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  14 ;   రెబ్బెన మండలం నంబాల గ్రామంలో దాయాదుల మధ్య భూవివాదం విషయంలో జరిగిన ఘర్షణలో  ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రేమండ్ కు తరలించినట్లు రెబ్బెన ఎస్సై శివ కుమార్ శనివారం తెలిపారు.శుక్రవారం రాత్రి పూదరి తిరుపతి, పూదరి భాస్కర్, పూదరి లక్ష్మి లు  జరిపిన దాడిలో  తన్నీరు పోషక్క, పర్వతి పద్మలు   తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.  బాధితురాలు పోషక్క కొడుకు   తన్నీరు  సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి  రిమండ్ కు తరలించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment