కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 2 ; సమాజంలో అవగాహన లోపం వల్లనే మోసాలు జరుగుతున్నాయని వాటిని అవగాహన ద్వారానే నివారించవచ్చు అని జిల్లా అడిషనల్ ఎస్పి అడ్మిన్ గోద్రు అన్నారు. సమస్యల పైన అవగాహన కలిపించటం లో పోలీస్ శాఖ ఎప్పుడు ముందు ఉంటుందని, కావున అటువంటి మోసాల గురించి తెలిసిన వెంటనే వాటిని పోలీస్ ల దృష్టికి తప్పక తీసుకువచ్చి వాటి నివారణలో తమ సహకారం ను అందించాలని ఆయన కోరారు. సోమవారం జిల్లాలోని స్థానిక పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ప్రజాఫిర్యాదు ల విబాగం ను ఆయన నిర్వహించారు, ఫిర్యాదు విబాగం లో మహమ్మద్ షహరే భర్త ముస్తఫా మలయాలపల్లి నివాసి తన భర్త తనను మానసికం గా శారీరకం గా వేదిస్తున్నాడని అతని పైన చట్టరిత్యా తగిన చర్య తీసుకోవాలని కోరారు, ఆత్రం శంకర్ తండ్రి భూమయ్య తన యొక్క భూ వివాదం ను పరిష్కరించాలని ఫిర్యాదు విబాగం లో ఫిర్యాదు చేశారు, దందేరా శంకరయ్య తండ్ట్ర్ మల్లయ్య గ్రామము బ్రాహ్మనచిచ్చాల దహేగం మండలం నుంచి కోర్ట్ ఇంజక్షన్ ఆర్డర్ వున్నా కూడా తమ యొక్క ప్రమేయం లేకుండా భూమి పైన గల తమ యొక్క హక్కులను అనుభవించకుండా అడ్డుకుంటున్నారని ప్రజా ఫిర్యాదు విబాగం లో ఫిర్యాదు చేశారు, చందూరి రమేష్ తండ్రి బాలయ్య ఆసిఫాబాద్ నివాసి తమ యొక్క సంక్రమిత ఆస్థి వివాదం పైన ఫిర్యాదు చేశారు, ప్రజా ఫిర్యాదు కు వచ్చిన ఫిర్యాదుదారులందరితో మాట్లాడిన అడిషనల్ ఎస్పి వారి వారి యొక్క సమస్యను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమము లో ఏ.ఓ భక్త ప్రహ్లాద్, సూపరింటెండెంట్ వంశీ, సీనియర్ అసిస్టెంట్ సూర్యకాంత్, ఇంతియాజ్,. అజయ్ వర్మ రిజర్వు ఇన్స్పెక్టర్ లు శేఖర్ బాబు , సంతోష్ , ఫిర్యాదుల విబాగం అధికారిని సునీత మరియు పీ ఆర్ ఓ మనోహర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment