Monday, 30 April 2018

ప్రజా ఫిర్యాదుల అర్జీలపై   అధికారులు తక్షణమే స్పందించాలి



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; ప్రజా ఫిర్యాదులలో వచ్చిన అర్జీలపై  సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్  అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజల నుండి దరఖాస్తులను సమావేశ మందిరంలో  స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అర్జీదారులకు  న్యాయం చేయాలన్నారు వివిధ రకాల సమస్యలపై అర్జీలు యాభై ఆరు వచ్చాయన్నారు అందులో  గోలేటి చెందిన  నర్సయ్య  రెండేళ్ల నుండి పెన్షన్ రావట్లేదని ,  కాగజ్ నగర్ నుండి ప్రవీణ్ కుమార్  తనకు విద్యుత్ షాక్ తో చేయి  కోల్పోయానని నష్టపరిహారం ఇప్పించాలని,  దానాపూర్ గ్రామస్థులు కరెంట్ సౌకర్యం కల్పించాలని, రాజంపేటకు చెందిన మూర్తి తనకు స్థలం ఇప్పించమని, ఎల్లంపల్లి, పెంచికలపేట గ్రామస్తులు  తాగునీటి సౌకర్యం కల్పించాలని జనకాపూర్కు చెందిన సంగీత డబుల్ బెడ్ రూమ్ ఇంటి   కొరకు, జనకాపూర్కు చెందిన పుష్ప తనకు భూమి ఇచ్చారు కానీ స్థలం చూపించడం లేదని తదితర దరఖాస్తులను  పాలనాధికారి కి  సమర్పించారు ఈ సమావేశాల్లో సంయుక్త పాలనాధికారి బి అశోక్ కుమార్, డిఆర్ఓ కంద సురేష్, డిఆర్డిఎ పిడి వెంకటి, సిపిఓ కృష్ణయ్య మరియు  జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment