Friday, 27 April 2018

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 27 ; రెబ్బెన మండలం తుంగెడ  గ్రామంలో బాల్య వివాహం  జరుగుతుందన్న   సమాచారం తో   ఐ.సి.డి.ఎస్. జిల్లా సంక్షేమ అధికారిణి   సావిత్రి, రెబ్బెన ఎం ఆర్ ఓ సాయన్న,   టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇనస్పెక్టర్  రాంబాబు,  ఎస్.ఐ. శివ కుమార్,    ఐ.సి.డి.ఎస్ సూపర్ వైజర్  సరస్వతి లు వివాహ మండపానికి వెళ్లి  వివాహాన్ని  అడ్డుకొన్నారు. అధికారులు  శుక్రవారం ఉదయం   గ్రామానికి చేరుకొని విచారించగా గ్రామంలోని లింగయ్య కుమార్తె మనస (16) ను తాండూర్ మండలం కాసిపేట నివాసి మల్లేష్ కుమారుడు రాజేశం(30)  కు ఇచ్చి శుక్రవారం ఉదయం 10. 55 కు  వివాహం చేయుటకు నిశ్చయించారని తెలిసిందన్నారు.  ఐ.సి.డి.ఎస్. జిల్లాసంక్షేమ అధికారిణి   సావిత్రి మాట్లాడుతూ  ఇరువైపుల తల్లితండ్రులకు పెద్దల సమక్షంలో  మైనర్ బాలికకు వివాహం చేయడం చట్టరీత్య నేరమని, చిన్నతనంలో పెళ్లిళ్లు చేయటం వలన అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయని తెలిపి వివాహాన్ని నిలుపుదల చేయటం జరిగిందన్నారు. అనంతరం టాస్క్ ఫోర్స్ సి ఐ  మాట్లాడుతూ  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఎలాంటి బాల్య వివాహాలు జరిగినా( అమ్మాయికి 18సం.లు, అబ్బాయికి 21సం.లు ), చిన్న పిల్లలను(14సం.ల లోపల) పనిలో పెట్టుకున్న నిర్భయంగా తెలియ పరచవచ్చనీ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని అన్నారు. సమాచారం ఇవ్వాల్సిన  ఫోన్ నంబర్లు 7901674826, 9000926208 అని తెలిపారు.  వీరితో పాటు   .టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు  పాల్గొన్నారు.



No comments:

Post a Comment