Monday, 2 November 2026

ఐదు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి ; కలెక్టర్‌కు సర్పంచుల వినతి

రెబ్బెన, నవంబర్‌ 2 ;       రెబ్బెన మండలం లోని  గంగాపూర్‌, లక్ష్మీపూర్‌, పాసిగాం, తుంగెడ, మదవాయిగూడ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఐదుగురు సర్పంచులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్ కు  వినతిపత్రం సమర్పించారు. బస్సులు లేక విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే వారు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఐదు గ్రామాల మీదుగా ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా బస్సులు నడిపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో గంగాపూర్‌ సర్పంచ్‌ వోలుబోజుల వెంకటేష్‌, లక్ష్మీపూర్‌ సర్పంచ్‌ చౌదరి సుభాష్‌, పాసిగాం సర్పంచ్‌ నగరం శంకరమ్మ, తుంగెడ సర్పంచ్‌ పలగని బుచ్చక్క, మదవాయిగూడ సర్పంచ్‌ దుర్గం సంధ్యారాణి ఉన్నారు.

No comments:

Post a Comment