కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 18 ; కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గ రోడ్డులో భారీ గుట్కా నిల్వలు ఉన్నాయనే ఖచ్చితమైన నిఘా సమాచారం తో బుధవారం టాస్క్ ఫోర్స్ సి. ఐ రాంబాబు నేతృత్వంలోనితనిఖీ చేయగా దుర్గ రోడ్డులో రవితేజ కిరణం నిర్వహించే తూడూరి రవీందర్ ఇంట్లోని బెడ్ రూంలో పరుపు కింద బాక్స్ లలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5,00,000/- విలువగల గుట్కా స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం కాగజ్ నగర్ టౌన పి.ఎస్. పోలీస్ వారికి అప్పగించడం జరిగింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా నిర్భయంగా తెలియ పరచవచ్చనీ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని అన్నారు. టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment