ప్రతి పౌరుడి జీవితంలో రోడ్డు భద్రత అంశాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెల్లంపల్లి ఏరియా గోలేటి జనరల్ మేనేజర్ రవిశంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు తొలి గురువుగా మారి రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.ఇరవై తొమ్మిది వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని గోలేటి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో అసిఫాబాద్ జిల్లా రవాణాశాఖ, బెల్లంపల్లి ఏరియా సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగులకు, కార్మికులకు, వాహన చోదకులకు, అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రవిశంకర్ ముఖ్యఅతితిగా మాట్లాడాతు. అందరూ స్వీయ రక్షణ సూత్రాలను పాటించడం వల్ల
రహదారులపై వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించడం సాధ్యమన్నారు. మనుషుల ఆలోచనా దృక్పథాలు మారకపోవడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి లక్షల్లో జనం చనిపోవడం జరుగుతుందని అన్నారు,వేల మంది క్షతగాత్రులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం లాంటి చిన్న విషయాల్లో ఏమరుపాటుగా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల విలువైన ప్రాణాలను కోల్పోతున్నామన్నారు. గ్రామాల్లో జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉన్న ఉంటున్నప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుందన్నఅనర్దానికి ప్రథమ కారణం, అవగాహన లేకపోవడం అని ఆవేధన వ్యక్తం చేశారు. రహదారుల నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం డివైడర్లు సిగ్నల్స్ హెచ్చరిక చిహ్నాల ఏర్పాట్లు శాస్త్రీయంగా ముందుకు వెళ్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు.
మోటార్ బైకులు ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం సెల్ఫోన్లు ఉపయోగించి వాహనాలను నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు పెరిగాయని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తే హైదరాబాద్ లో తల్లిదండ్రులకు జైలుకు పంపిస్తున్నామన్నారు. దీన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకుని మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వద్దని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై హత్యానేరం కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మంచిర్యాల పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయని వివరించారు. వేగ నియంత్రణ ట్రాఫిక్ సూత్రాలను విధిగా పాటించాలని ప్రతి ఒక్కరు రహదారి భద్రతా అవగాహన కలిగి ఉండాలని అందరిలోనూ చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమానికి నిర్వహణకు సహకరించిన యాజమాన్యానికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం శ్రీనివాస్, డివైపిఎం సుదర్శన్, టిబిజికెఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు, అసిఫాబాద్ గిరిజన మహిళా డిగ్రీ కళాశాల ప్రినిపాల్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment