కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ; రెబ్బెన మండలంలో నకిలీ పత్తి విత్తనాలు విస్తృతంగా ఉన్నాయని సమాచారం మేరకు కాగజ్ నగర్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో పోలీసులు విస్తృత సోదాలు చేపట్టారు కౌటాల సిఐ మోహన్, దేగాం ఎస్సై దికొండ రమేష్, బెజ్జూర్ ఎస్సై రామారావు ఆర్ఎస్ అనిల్ సుమారు నలభై మంది పోలీసుల బృందం గురువారం తనిఖీలు నిర్వహించారు. రెబ్బెన, ఖైర్ కూడా, తక్కలపల్లి రోళ్లపాడు గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి నకిలీ విత్తనాలు నిల్వ ఉంచినట్లు అందిన సమాచారంతో అనుమానిత వ్యక్తులు ఇంట్లో సోదాలు నిర్వహించారు సోదరులుగా రెవరెండ్ కేంద్రంలోని చిట్టినేని అప్పారావు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై కిలోల బీటీ త్రి విత్తనాలుఖైర్ కూడాలో అజ్మీర సీతారాం ఇంట్లో పది కిలోలు బీటీస-3 విత్తనాలు లభ్యమయ్యాయన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ విత్తనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ను తరలించారు. అక్రమంగా నకిలీ విత్తనాలు నిల్వ ఉంచిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన బీటీ త్రి పత్తి విత్తనాలను అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలతో తీసుకుంటమన్నారు. అన్నారు ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు నకిలీ విత్తనాలు సరఫరా అయ్యాయని ముందస్తుగా అందించిన సమాచారతో ఎస్పీ కాలేజీ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాలతో పలు గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా ఎక్కడికక్కడే గట్టి నిఘా పెంచినట్లు తెలిపారు
No comments:
Post a Comment