కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 2 ; ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అని కొమురంభీం జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల విభాగంలో భాగంగా జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో అర్జిదారుల నుండి ఆర్జీలను స్వీకరించారు. వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ లోనే సమస్య పరిష్కరించాలని ఆన్ లైన్ లో రెండు రకాల దరఖాస్తులు వస్తాయని ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల్లో వచ్చేది ఒకటి రెండోది మీ సేవా ద్వారా దరఖాస్తు దారుడు స్వయంగాఆన్ లైన్ లో చేసుకున్న దరఖాస్తులు ఉంటాయన్నారు. ఆయా శాఖల అధికారులు దరఖాస్తు చేసుకున్న దరక్షతుదారుడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. భట్టుపల్లి నివాసి తిరుపతి కొమురంభీం ప్రాజెక్టు ఎడమ కాలువ ముంపునకు గురికావడం వల్ల నష్టపరిహారం ఇప్పించుటకు, కాగజ్ నగర్ మండలం గంగన్న గూడ గ్రామ నివాసి సీత ఇందిరమ్మ ఇళ్లు నిధులు ఇప్పించాలని రెబ్బెన మండల గ్రామస్తులు బోరు వేయించాలని, బూరుగూడ వృద్ధులు తమకు పెన్షన్ రావడం లేదని, రెబ్బెన మండల నివాసి బి శ్రీనివాస్ దళితబస్తీ కింద భూమి ఇప్పించాలని సిర్పూర్ టీలో కిచెన్ షెడ్ పనులు పూర్తయ్యాయని ఇప్పటి వరకు బిల్లు రాలేదని విన్నవించారు.ప్రజాఫిర్యాదుల్లోసుమారు ఎనభైమంది దరఖాస్తులు వచ్చాయి అన్నారు ఈకార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ కుమార్, డిఆర్ఓ కంద సురేష్, డిఆర్డివో పిడి వెంకటి జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment