కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; పంటల కోసం చేసిన అప్పులే తనపాలిట శాపంగా మరి తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి ఆసిఫాబాద్ చోర్ పల్లి గ్రామానికి చెందిన బోయిరి దావు (45) సోమవారం రాత్రి అప్పుల బాధ తాళలేక ఆత్మ హత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆరు ఎకరాల భూమినిసాగు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూతురి వివాహం కోసం సుమారు పది లక్షల మేర అప్పు చేశాడు. గత ఏడాది ఏడు లక్షల యాభై వేలు అప్పు కింద నాలుగు ఎకరాల భూమిని అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకున్నాడు. మిగిలిన రెండు ఎకరాల్లో సేద్యం చేసినప్పటికీ అంతగా దిగుమతి రాకపోవడంతో మిగిలిన అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించాడు. కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకోవడంతో గమనించి భార్య ఇరుగు పొరుగు వారికి తెలియజేయడంతో వారు వెంటనే 108 అంబులెన్స్లో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య కమల , ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు మృతుడి కుటుంబ సభ్యులను మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్ల నారాయణ పరామర్శించారు.
No comments:
Post a Comment