
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 28; కొమురంభీం జిల్లా కేంద్రంలోని రవిచంద్ర కాలనీలో శనివారం తెల్లవారుజామున జిల్లా ఎస్.పి. కల్మేశ్వర్ సింగెనవార్ నేతృత్వంలో డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. 40 మంది పోలీసులతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎస్.పి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకై పోలీసు శాఖ అనేకమైన చర్యలు చేపడుతున్నదని, అనుమానిత వ్యక్తుల కదలికలను కట్టడి చేయటానికి ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదే సందర్భంలో ప్రజలతో మాట్లాడుతూ, పోలీసు శాఖాపరంగా వారి ఆలోచనలను పంచుకుంటూ, సూచనలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. తనిఖీల సందర్భంగా మహిళలు, యువతను చైతన్యపరిచేందుకు తమకు అవకాశం లభిస్తుందని తెలిపారు. తనిఖీలలో ప్రజలు కూడ చక్కగా సహకరించడం పట్ల ఎస్.పి. సంతృప్తి వ్యక్తపరిచారు. తనిఖీలలో డి.ఎస్.పి. సాంబయ్య ఇన్స్పెక్టర్లు బాలాజీ వర ప్రసాద్, వాంకిడి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సై లు చంద్ర శేఖర్,40 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జరిగిన తనిఖీలలో 8 మోటారు బైకుల ను తగిన దృవ పత్రాలు లేనందున అధికారులు స్వాధీనం చేసుకు న్నారు,150 గుట్కా ప్యాకెట్లు,40 మద్యం సీసాలను మరియు 2 లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
No comments:
Post a Comment