
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 8 ; ఆర్మీ రిక్రూట్మెంట్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని డిఎస్పి సత్యనారాయణ అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం లోని గోలేటి సింగరేణి పాఠశాల మైదానం లో నిరుద్యోగ యువతకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలి పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో డిఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మరియు జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు జిల్లా అంతటా ఆర్మీ ప్రీ సెలక్షన్ గురించి మరియు ఆర్మీ ఉద్యోగాల ఎంపిక గురించి యువకులకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 21 నుంచి 31 వరకు హన్మకొండ నందు గల జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలి నిర్వహించబడునని ఇందులో 18 నుంచి 23 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు పాల్గొనవచ్చు అని అయన తెలిపారు. అలాగే దేహ దారుడ్య పరీక్షా ఉత్తీర్ణులు అగుటకు పోలీస్ శాఖ తరుపున ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు నిర్వహించే పరిక్షలు అయిన 1) 1.6 km పరుగు, 2) పుల్ అప్స్ 3) 9 ఫీట్ డిచ్ 4) జిగ్జాగ్ బ్యాలేన్చింగ్ టెస్ట్ ల యందు ముందుగానే ప్రీ సెలక్షన్ నందు ఎంపిక కాబడిన అభ్యర్థులకు సుశిక్షితులైన శిక్షకుల చే శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని పట్టుదలతో ఆర్మీ రిక్రూట్మెంట్ లో విజయాన్నిసాధించి జిల్లాకు మరియు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలన్నారు.జిల్లా లోని శిక్షణ పొందే అభ్యర్థులు నేరుగా సమీప పోలీస్ స్టేషన్ లో సంప్రదించి పోలీస్ అధికారుల నుంచి ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలి కు సంబందించిన పూర్తి వివరాలను పొందవచ్చునని ఆయన తెలిపారు. ఈ అవగాహనా సదస్సులో రెబ్బెన సర్కిల్ నుంచి 52 మంది అభ్యర్థులు ,ఆసిఫాబాద్ సర్కిల్ నుంచి 26, జైనూర్ నుంచి 20 మరియు వాంకిడి నుంచి 23 మంది అభ్యర్థులు పాల్గొన్నారని డిఎస్పి సత్యనారాయణ తెలియచేసారు. అనంతరం జిల్లా గ్రామీణఅభివృద్ధి అధికారి వెంకట్ మాట్లాడుతూ జిల్లా లోని ఆర్మీ ఉద్యోగం పొందబోయే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని దినిని తప్పక వినియోగించుకొని జిల్లా కు మంచి పేరు ను తీసుకురావాలని ఆయన కోరారు.ఈ అవగాహన సదస్సులో రెబ్బెన సి ఐ పురుషోత్తం ,రెబ్బెన ఎస్సై శివకుమార్ , డిఆర్డిఓ అధికారులు అన్నాజీ , మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment