Monday, 16 April 2018

ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: జాయింట్ కలెక్టర్


ప్రతి సోమవారం జరిగే ప్రతి ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా సోమవారం  కొమురంభీం జిల్లా పాలనాధికారి కార్యాలయంలో సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్ ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ సంబంధిత అధికారులు ప్రజాఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలన్నారు.  ఈ రోజు  దాదాపు 68 అర్జీలు వచ్చాయన్నారు. లింగాపూర్ నివాసి జాదవ్ రజిత కల్యాణ లక్ష్మి పథకం డబ్బులు అందలేదని,రెబ్బెన మండలం జక్కులపల్లి శివారులోని భూమి ముంపుకు గురైందని నస్టపరిహారం ఇప్పించాలని, కాగజ్ నగర్ శంకర్  వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలని , సర్కపల్లి గ్రామంనుంచి కౌసల్య, వాంకిడి  మండల నివాసి అంగన్వాడీ టీచర్ పోస్టుకు, తిర్యాణి మండలంలోని పంగిడి గ్రామపంచాయితీ గోవెనలో అంగన్వాడీ సెంటర్ లేదని ,రాళ్ళకన్నేపల్లి  గ్రామస్తులు బి టి రోడ్ పనులు పూర్తిచేయాలని, మంగి గ్రామస్తులు బావి రింగుల కోసం దరఖాస్తు చేశారన్నారు. ఈ సమావేశం లో డిఆర్ఓ కంద సురేష్, సీపీఓ క్రిష్ణయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment