కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 13 ; దేశవ్యాప్తంగా బొగ్గు గనులలో ఈ నెల 16న జరిగే ఒక రోజు సమ్మెను అన్ని సంఘాలు కలిసి విజయవంతం చేయాలని ఎఐటియుసి ఉపాధ్యక్షులు బయ్య మొగిలి కోరారు. శుక్రవారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటిలోని ఓసిపి2 ఏరియా వర్క్ షాప్ లో ఎఐటియుసి ఆధ్వర్యంలో జరిగిన సభలో కార్మికులతో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తుందని దీనివలన బొగ్గుగని కార్మికులు అనేక హక్కులు కోల్పోతారని తెలిపారు. అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం సొంత ఇంటి పథకం కింద పది లక్షల రుణాన్ని ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని పదవ వేజ్ బోర్డ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, పెంచిన గ్రాట్యుటీ బిల్లులు 1-1-16 నుంచి అమలు చేయాలని అన్నారు. పై డిమాండ్స్ పై జరిగే సమ్మెను కార్మికులు విజయవంతం చేసి కార్మిక హక్కులు పరిరక్షణ కిందకు తీసుకురవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ కార్య దర్శలు ఉబ్బి జగ్గయ్య, ఎం శేషు, తీగల శ్రీనివాస్, నాయకులు మహేందర్ రెడ్డి, లక్ష్మణ్, శివ, భిక్షమయ్య, ఓదేలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment