కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 16 ; అటవీ సంరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వన్యప్రాణులను వేటాడరాదని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బి మహేందర్ అన్నారు. కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం వదిలొద్ది గ్రామంలో సోమవారం గ్రామస్తులకు అటవీ చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవిలో వేటకు సంబంధించి ఎలాంటి ఉచులను, కరెంటు తీగలను అమర్చరాదన్నారు. అడవి బాటలో ప్రయాణం చేసేటప్పుడు అగ్గి వెలిగించరాదన్నారు. పోడు వ్యవసాయం కొరకు చెట్లను నాశనం చేయకూడదని, వన్యప్రాణులను కాపాడుకొని ఆటవిసంపదను పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment