Monday, 9 April 2018

క్రిమిసంహారక దుకాణాల్లో తనిఖీలు


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 9 ;    నఖీలి విత్తనాలు, కాలం ముగిసిన క్రిమిసంహారక మందులను  క్రిమిసంహారక దుకాణాల్లో అమ్మరాదని రెబ్బెన ఎస్సై శివకుమార్ అన్నారు సోమవారం రెబ్బెన మండలంలోని  ఫెర్టిలైజర్స్ షాప్స్ పై  పోలీసు సిబ్బంది మరియు  వ్యవసాయ అధికారులు మార్క్, అర్చన లు సంయుక్తంగ కలిసి నారాయణపూర్ లో గల  శివ సాయి  మరియు మహేంద్ర ఫర్టిలైజర్ షాపులను విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. వారు మాట్లాడుతు రానున్న ఖరీఫ్ పంటల సాగు దృష్ట్యా ముందస్తుగా  గ్రామాలలో ఎటువంటి నకిలీ విత్తనాలు అమ్మకుండా నకిలి విత్తనాల వలన రైతులు మోసపోకుండా అవగహన కల్పిస్తున్నామన్నారు, గ్రామాలలో ఉన్న అన్ని ఫెర్టిలైజర్స్ షాప్స్ ను. గత  కొద్దీ రోజులుగా  నఖీలి విత్తనాలు, కాలం ముగిసిన క్రిమిసంహారక మందులు ను పూర్తి స్థాయి లో తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా నకిలి విత్తనాలను, నఖిలి క్రిమిసహరక మందులను సరఫరా చేసి రైతులను మోసం చేసినట్లయితే  చట్ట పరమైన  చర్యలు తీసుకుంటామన్నారు.

No comments:

Post a Comment