Tuesday, 3 April 2018

ఆరోగ్య కేంద్రం నిర్వహణ తీరు మారాలి : జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 3 ; కొమురంభీం  జిల్లా  రెబ్బెన మండల కేంద్రంలోని  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రి పరిసరాలలో చెత్త చదరం పేరుకుపోవడాన్ని గమనించిన  ఆయన   ఒకప్పుడు ఆదర్శ  వైద్యశాలగా పేరు గాంచిన ఆరోగ్య  కేంద్రం ను   నిర్వహించే తీరు ఇదేనా అని  సిబ్బందిపై  ఆగ్రహం వ్యక్తం   చేసారు.
తక్షణం వాటిని శుభ్రం చేయాలనీ ఆదేశించారు. రోగులకు వాడిన   ఇంజక్షన్ సిరంజిలను తదితర వస్తువులను జాగ్రత్తగా పడవేయాలన్నారు. వీల్ ఛైర్లు బాగుచేయించి రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు.గతంలో   స్థానికంగా విధులు నిర్వహించిన డాక్టర్ సంతోష్ సింగ్  సేవాభావంతో ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   అనంతరం  జరిగిన ఆశా కార్యకర్తల సమావేశంలోమాట్లాడుతూ   వేసవికాలంలో  ప్రజలు వడదెబ్బకు  గురికాకుండా కార్యకర్తలు  గ్రామాలలో తగు సలహాలు సూచనలు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో  స్థానిక వైద్యాధికారి కుమారస్వామి హెల్త్ సూపర్ వైజర్లు సంతోష్ ,పావని తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment