డాక్టర్ బాబు జగ్జిమం రామ్ అందరికి ఆదర్శప్రాయుడు
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 5 ; నేటి యువత డాక్టర్ బాబు జగ్జిమం రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆద్వర్యం లో నిర్వహించిన డాక్టర్ శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 111 వ జయంతి వేడుకలను గురువారం ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.తదనంతరం వారు మాట్లాడుతు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటె ఏదైనా సాధించగలమని బాబు జగ్జిమం రామ్ నిరూపించారన్నారు.బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య పోరాటంలో తనదైన శైలిలో పోరాటం చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారు 40 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా ఉంటూ అనేక మంత్రివర్గాలలో సహాయ మంత్రిగా, మంత్రిగా పదవులు అలంకరించారన్నారు. ముఖ్యంగా వ్యవసాయ మంత్రిగా అయన చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు దేశానికీ ఎంతో మేలుచేశాయన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ అశోక్ కుమార్, అదనపు ఎస్ పి గోద్రు, ఆర్ డి ఓ సురేష్,సర్పంచ్ సరస్వతి, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment