కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; కొమురంభీం జిల్లా కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం లో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాను సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆసీఫాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. జాబ్ మేళాలో సుమారు 80 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఐటీడీఏ జేడీఎం నాగభూషణం మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని మరియు నెలకు తొమ్మిది వేల నుంచి పదివేల జీతం మరియు ఉచిత భోజనం తో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని నిరుద్యోగ యువకులు ఈ ఉద్యోగాల్లో చేరి తమ భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ వెంకట్ , డిపిఎం అన్నాజీ మరియు క్యాంపస్ గ్రూప్ హెచ ఆర్ మధుసూదన్, ప్రీమియం హోంకేర్ హెచ్ఆర్ వసంత్ మరియు ఏపీ ఫెటలిస్ హెచ్చార్ మహేందర్, ఐకేపీ సిబ్బంది సిసిలు పాల్గొన్నారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment