Thursday, 5 April 2018

డా: జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు


 కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 5 ;  రెబ్బెన:  బాబు జగ్జీవన్ రామ్ 111 వ  జయంతి ఉత్సవాలను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన మండల రెవిన్యూ కార్యాలయం లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  తహశీల్ధార్ సాయన్న   జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి  మాట్లాడారు.  డా: బాబు జగ్జీవన్ రామ్  స్వతంత్ర సమరయోధుడిగా,సంఘ సంస్కర్తగా భారతావనికి విశిష్ట సేవలందించారని వారి సేవలు మరువ లేనివని తెలిపారు.ఈ కార్యక్రమంలో  రెవిన్యూ  విఆర్వోలు ఉమ్లాల్,ధోని బాపు గ్రామస్థులు శెంకర్,దుర్గం రాజేష్,శ్రీను, లాల్ సింగ్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment