కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 6 ; ఏప్రిల్ 29న జరగబోయే యాదవ కురుమల శంఖారావం సభకి సంబందించిన ఛలో సికింద్రాబాద్ పోస్టర్ ను ఎమ్మెల్యే కోవా లక్ష్మి చేతుల మీదుగా విడుదల చేసిన యాదవ కురుమల కులస్తుల నాయకులు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ఎం ఎల్ ఏ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పోస్టర్ ను విడుదల చేసి మాడ్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నికులాలను సమానంగా ఆదరిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమురం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు గాదవేని సుధాకర్ యాదవ్ , బండి సదానందం యాదవ్ మాంచెరియల్ అధ్యక్షులు , సౌధాని భూమన్న యాదవ్, నిర్మల్ అధ్యక్షులు , సతీష్ కుమార్ , గాదవేని మల్లేష్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment