కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 23 ; కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ బృందం గిరిజన ఏజన్సీ మండలా లైన తిర్యాణి. లింగపూర్. సిర్పూర్ యు, .జైనూర్ మండలాలలో ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికి పర్యటించింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మిషన్ భగీరథ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు. ఏళ్ళకి ఏళ్లు గడుస్తున్నా మంచినీటి సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మండల కేంద్రానికి చేసుకోవడానికి రహదారులు అధ్వానంగా ఉన్నాయని వేసిన రోడ్లు కాంట్రాక్టర్లు అధికారుల అవినీతి మూలంగా అధ్వాన్నంగా తయారయ్యాయన్నారు. . ఏళ్ల తరబడి సాగు చేస్తున్నా అటవీ భూములకు పట్టాలు ఇవ్వక పోవడంతో సాగు కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. . ప్రభుత్వ భూములు కాస్తు చేస్తున్న వారందరికీ రైతు బందు పథకం అందరికీ వర్తింప చేసి పట్టాలు ఇవ్వాలని. కేంద్రప్రభుత్వం ప్రదాన మంత్రి ఉజ్జ్వల యోజన ద్వారా యస్ సి. యస్ టి. మహిళల లకు గ్యాస్ కనెక్షన్లు సిలిండర్ . స్టౌ ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ డీలర్లు. కొన్ని గ్రామాల్లో సబ్ డీలర్లను ఏర్పాటు చేసుకుని అమయక ప్రజలను దోపిడీ చేస్తున్నారు అన్నారు. ఇలాంటి గ్యాస్ ఏజెన్సీల పై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏన్నికల ముందు . డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. దళితుడు ముఖ్యమంత్రి. దళితులకు మూడు ఎకరాల భూమి. ఇంటికో ఉద్యోగం. లక్ష ఉద్యోగాలు భర్తీ. కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య. లాంటి మరెన్నో హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు ప్రతి ఇంటికి అందేలా బిజెపి నాయకులు , కార్యకర్తలు సైనికుల లాగా పని చెయ్యాలన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్. జదవ్ రమేష్.జిల్లా కోశాధికారి బిజన్ మల్లిక్. గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షులు మడావి షైన్ షా. మండల అధ్యక్షులు జదవ్ రామారావు, ప్రదాన కార్యదర్శి మడావి శెకు, తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment