Friday, 13 April 2018

కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలి ; జీఎం రవిశంకర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  13 ;  కార్మికులు సమ్మెలో పాల్గొనకుండా విధులకుహాజరు కావాలని  బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి జీఎం కె రవిశంకర్ అన్నారు. శుక్రవారం జీఎం  కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నాలుగు జాతీయ సంఘాలు తలపెట్టిన ఒక్కరోజు  సమ్మెలో జాతీయ సంఘాలు చేస్తున్న డిమాండ్ అయిన బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేయడం అనే అంశం పై  నిర్ణయాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని అన్నరు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ సింగరేణి యాజమాన్యానికి నిర్ణయాధికారం లేదని వారు గుర్తుచేశారు.  ఇటీవల ముఖ్యమంత్రి  శ్రీరాంపూర్ పర్యటనల్లో సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోప్రైవేట్ పరం కానివ్వమని హామీని గుర్తుచేస్తారు. సమ్మె వల్ల సంస్థ నష్టపోవడమే కాకుండా ఏటువంటి ప్రయోజనం చేకూరదని ఈ సమ్మె వల్ల సంస్థకు సుమారు 55 కోట్ల   నష్టం వాటిల్లడమే కాకుండా ఉద్యోగులు  సుమారుగా 20   కోట్ల వేతనాలు నష్టపోతారు కావున విజ్ఞులైన సింగరేణి ఉద్యోగులు  సమ్మెకు దూరంగా ఉండవలసిందిగా కోరారు.   బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తున్న సింగరేణియులు  రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ సంస్థ  అభివృద్ధిలోనూ పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోఎస్ ఓ టూ జిఎం శ్రీ ఎం శ్రీనివాస్ డీజీఎం పర్సనల్ జె కిరణ్ డివైపిఎం ఎల్ రామశాస్త్రి లు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment