కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 10 ; రేషన్ బియ్యం, గుడుంబా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం, పటిక, అనుమతిలేని దీపావళి టపాసులు మరియు గుట్కాప్యాకెట్లు స్వాధీన పర్చుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సి. ఐ రాంబాబు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్ పి కల్మేశ్వర్ సింగన్ వార్ ఆదేశాల మేరకు మంగళవారం ఆసిఫాబాద్ మార్కెట్ ఏరియాలోని పలు షాపులలో అక్రమ రవాణా కు సిద్దంగా ఉంచిన రేషన్ బియ్యం, గుడుంబా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం, పటిక, అనుమతిలేని దీపావళి టపాసులు మరియు గుట్కా నిల్వలు ఉన్నాయి అని ఖచ్చితమైన నిఘా సమాచారం తో పట్టణంలోని పలు షాపులపై దాడి చేయగా కన్యక పరమేశ్వరి ఆలయం దగ్గర్లోని గుండా వినేష్ యొక్క మహాలక్ష్మి ట్రేడర్స్ గోదాములో 24,200/- విలువ గల11క్వింటాళ్ల రేషన్ బియ్యం , 1.20 క్వింటాళ్ల నల్ల బెల్లం, కాసం వినేశ్వర్ యొక్క షాపులో 8000/- విలువ గల అనుమతిలేని దీపావళి టపాసులు మరియు వివేకానంద చౌరస్తాలో చిలువేరు శ్రీదర్ యొక్క సి హెచ్ నాగయ్య &సన్స్ షాపు పై దాడి చేయగా 65,170/- విలువ గల గుట్కా ప్యాకెట్లు, 10కిలోల నల్ల బెల్లం, 10కిలోల పటిక స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు రమణ రెడ్డి, ప్రసాద్, వెంకటేష్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment