కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 13 ; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాన్నయని బీజేపీ బీజేపీ జిల్లా అధ్యక్షులు జె బి పౌడెల్ అన్నారు. శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటి బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జె బి పౌడెల్ మాట్లాడరు. ప్రధాన మంత్రిజీవన్ భీమా యోజన పథకం ద్వారా గత సంవత్సరం ఆగష్టు లో మరణించిన గోలేటి గ్రామానికి చెందిన సమత రెడ్డి కుటుంబసభ్యులకు 2,00,000 రూపాయల చెక్కును బ్యాంకుమేనేజర్ సతీష్ అందచేశి మాట్లాడురు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రవేశ పెట్టిన పలు సంక్షేమా పథకాలతో సామాన్య ప్రజలకు ఊరట లభిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులూ సుదర్శన్ గౌడ్, చక్రపాణి, బాలకృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment