రెబ్బెన మండలంలో రేకులుగూడ గ్రామంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో కొమరం కమలాబాయి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికుల కథనం ప్రకారం కమలబాయి కిరోసిన్ దీపం చేత పట్టుకుని ఇంట్లో ఉన్న కోళ్లను గుడ్లు కమ్మేందుకు ప్రయత్నిస్తుండగా కోడి ఎగిరి దీపాన్ని తన్నడంతో ప్రమాదశాత్తు దీపం వలికి చీరపై పడింది దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి చేతులు చతి భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. మంటల ధాటికి తట్టుకోలేక అరుపులు వేయడంతో గమనించిన చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలను అదుపు చేసి కాపాడారు. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ హుట హుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలి పరామర్శించారు. ప్రమాదశాత్తు తీవ్రంగా గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం 108 లొ బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం మంచి రాళ్లకు తరలించారు.
No comments:
Post a Comment