Sunday, 15 April 2018

16 న ఆయుర్వేద వైద్య శిబిరం

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 15 ; బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ నెల 16న  గోలేటి టౌన్ షిప్ మరియు మాదారం టౌన్ షిప్ లలో   ఆయుర్వేద వైద్య  శిబిరం నిర్వహిస్తున్నట్లు ఏరియా డీజీఎం పర్సనల్ జే  కిరణ్ ఒక  ప్రకటనలో తెలిపారు.  గోలేటిలోని  సిఇఆర్ క్లబ్లో ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు మరియు మాదారం టౌన్ షిప్ లో  సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఆయుర్వేద శిబిరం నిర్వహించబడునని తెలిపారు.  హైదరాబాద్ నుండి డాక్టర్ విశ్వనాథ్ మహర్షి  వస్తున్నారు.  కావున కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియగం చేసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment