Friday, 6 April 2018

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 6 ; భారతీయ జనతా పార్టీ 38 వ ఆవిర్భావ దినోత్సవ  వేడుకలలో భాగంగా శుక్రవారం కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో ఆవిర్భావ వేడుకలను  ఘనంగా జరుపుకున్నట్లు బీజేపీ రెబ్బెన మండల అధ్యక్షులు కుందారపు బాలక్రిష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలోని  కేంద్రప్రభుత్వం గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో మంచి  పథకాలు ప్రారంభించిందన్నారు. ప్రధాని మోడీ ప్రారంభించిన స్వచహారథః మిషన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడిందన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు.  ఈ కార్యక్రమంలో    బీజేపీ జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, బీజేవైయం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురపు సంజీవ్ , బీజేవైయం జిల్లా కార్యదర్శి వడాయి గొండయ్య , బీజేవైయం రెబ్బెన మండల ప్రధాన కార్యదర్శి వడాయి కాంతారావు , బీజేవైయం రెబ్బెన మండల కార్యదర్శి గిరుగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment