కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 24 ; ఆసిఫాబాద్ చిర్రకుంట గ్రామంలో అక్రమ మద్యం మరియు బెల్లం నిల్వలు న్నాయన్న ఖచ్చితమైన నిఘా సమాచారం తో ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సి. ఐ అల్లం రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు మంగళవారం సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. చిర్రకుంట గ్రామంలో తనిఖీ చేయగా అరిగెల మవిన్ కుమార్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10,220/- విలువగల మద్యం మరియు 15 కిలోల ల బెల్లం, కోట కుమార్ ఇంట్లో 10,710/- విలువగల అక్రమ మద్యం మరియు జమ్ముల రమేష్ షాపులో 6,215/- విలువగల మద్యం స్వాధీనం చేసుకొని కేసు ను తదుపరి విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ పి.ఎస్. పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.
No comments:
Post a Comment