Sunday, 1 April 2018

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి


 కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 1 ;   ప్రజలు ఎండాకాలం  తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంఎల్ఏ  కోవలక్ష్మి అన్నారు. ఆదివారం  రెబ్బెన మండలం లోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ లో విశ్రాంత ఎం ఆర్ ఓ  బండారి రమేష్ గౌడ్ తన కుమారుడు  స్వర్గీయ  ఫణి కుమార్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రారంబించారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ ఎండలు మండిపోతున్నందున బాటసారుల దప్పిక తీర్చడం కోసం చలివేంద్రం ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో  రెబ్బెన తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.    

No comments:

Post a Comment