Thursday, 12 April 2018

ఎఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  12 ; బెల్లంపల్లి ఏరియా   గోలేటిలోని అన్ని ఉపరితల గనులు మరియు డిపార్ట్మెంట్ల వద్ద ఎఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆయా గనుల మేనేజర్లకు వినతిపత్రాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా కైరిగూడ ఓపెన్ కాస్టులో ఎఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటు ఏజెన్సీల ద్వారా బొగ్గు వెలికి తీసి అమ్మే ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థలు అయిన కోలిండియా మరియు సింగరేణి సంస్థలను యథాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.  అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు కారుణ్య నియామకాలు, గృహ నిర్మాణం కోసం పది లక్షల వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా కాకుండా కంపెనీ చెల్లించాలని 1.1 2016   నుండి పెంచిన గ్రాట్యుటీ  ఇరవై లక్షలు అమలు పరచాలని, కోలిండియాతో సంబంధం లేకుండా సింగరేణిలోఒకే దఫా ఏరియర్స్ను చెల్లించాలని డిమాండ్ చేసారు.   కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి పారిశ్రామిక శాంతిని కాపాడాలని పదహారో తేదీన జరిగే టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.  ఈ సమ్మె ఉద్యోగ భద్రత కార్మికుల హక్కుల పరిరక్షణకు జరుగుతున్న సమ్మెఅని  ఏ ఒక్క కార్మికుడు కూడా విధులకు హాజరు కావద్దని ఆయన కోరారు.  ఖైరిగూడ కార్యక్రమంలో వినతిపత్రాన్ని గని రక్షణాధికారి శంకర్ కు  అందజేశారు.   ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి జూపాక రాజేష్ సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు ఐఎన్టియుసి నాయకులు పల్లాస్ ఎఐటియుసి సహాయ కార్యదర్శి దివాకర్ , బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్ర శేఖర్, రహమాన్, కృష్ణ, జాడి స్వామి, కె  తిరుపతి, మరియు  దొర్లి 1 లో ఎస్ ఓ నారాయణకుఫిట్ కార్యదర్శి  ,విష్ణు, నగేష్, రాజేశం, నవీన్,చంద్రయ్య,నాగరాజేలు, ఏరియా వర్క్ షాప్ లో ఇంజనీర్ రఘురాంకు హీరాలాల్,ప్రభాకర్,శివ, రెడ్డి లు అందచేశారు.

No comments:

Post a Comment