కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ; రెబ్బెన మండలంలోని దేవుల గూడ సమీపంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నంబాల గ్రామానికి చెందిన కాటుక ఎర్రయ్య వయస్సు అరవై సంవత్సరాలు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. రెబ్బెన ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎర్రయ్య సోమవారం తాండూరు మండలంలోని అంకుశం గ్రామంలో బంధువుల దహన సంస్కార కార్యక్రమానికి హాజరై రాత్రి తిరుగు ప్రయాణంలో దేవుల గూడలో బసచేశాడు మంగళవారం తెల్లవారు జామున తన స్వగ్రామమైన నంబాలకు వెళ్లే క్రమంలో అంతర్రాష్ట్ర రహదారి దాటుతుండగా ఆసిఫాబాద్ నుండి బెల్లంపల్లి వైపు వెళుతున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.డీకొట్టిన లారీ గోలేటి ఎక్స్ రోడ్డు సమీపంలోని సింగరేణి సీఎస్పీ వద్ద వాహనాన్ని నిలిపి డ్రైవర్ పరారయ్యారు .వెంటనే సమాచారం అందుకున్న ఎస్ఐ శివకుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించాడు వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు.కాగా మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. ఈ మేరకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
No comments:
Post a Comment