కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 13 ; బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి భీమన్న స్టేడియం లో ఈ రోజు 32 వ వేణుగోపాల్ స్మారక ఇన్విటేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను శుక్రవారం జనరల్ మేనేజర్ కె రవిశంకర్ ప్రారంభించారు. ఈ రోజు నుండి 15 వ తేదీవరకు జరిగే ఈ టౌర్నమెంట్లో ఖమ్మం, హైదరాబాద్, పాల్వంచ, గద్వాల్, కరీంనగర్, ఆదిలాబాద్,గుంటూరుల నుండి జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం ఎం శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ జె కిరణ్, టి జి బి కే ఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ మోహన్ రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment