కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 18 ; ఏప్రిల్ 22 నుంచి ప్రారంభంకానున్న సిపిఐ (ఎం) జాతీయసభలకు కొమురంభీంఆసిఫాబాద్ జిల్లా నుండి పెద్దఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కూసన రాజన్న పిలుపునిచ్చారు. బుధవారం చలో హైదరాబాద్ పేరిట జరిగిన సమావేశం లో మాట్లాడుతూ రానున్న కాలంలో దేశంలో పెను మార్పులు సంభవించనున్నాయని వాటిలో సిపిఐ (ఎం) పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ జాతీయ మహాసభలు బహుజన ఎజండానే ప్రాతిపదికగా తీసుకుని జరుగుతున్నాయన్నారు. గత పాలకులు ప్రజలకు చేసిందేమి లేదని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలపై నోట్లరద్దు, జి ఎస్ టి వంటి వాటితో తీవ్రమైన భారం మోపిందన్నారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని నాలుగేళ్ళ పాలన తర్వాత కూడా ఆ దిశగా ఎలాంటి ప్రతిపాదన చేయలేదని అన్నారు.ఈ మహాసభలలో జాతీయ నాయకులు పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అల్లూరి లోకేష్ తదితరులుపాల్గొన్నారు .
No comments:
Post a Comment