కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 22 ; యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి లక్షణాలు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మన జిందగీ లఘుచిత్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన రుద్ర నేత్ర లఘు చిత్రంకు సంబందించిన ప్రచార పత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ సమాజ మార్పుకు ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెడు వ్యసనాలకు బానిస కావడం ద్వారా కుటుంబం చిన్నాభిన్నమవుతుందన్న అంశంపై నిర్మించిన చిత్రం అందరికీ ఆదర్శంగా నిలవాలని సమాజంలో స్త్రీని చిన్నచూపు చూసే పద్ధతి మారాల్సిన అవసరం ఎంతో ఉందని ఇలాంటి చిత్రాలు చూపించడం వల్ల యువతలో మార్పు వచ్చి మంచి లక్షణాలు అవలంభిస్తారని అన్నారు. ఇలాంటి లఘుచిత్రాలు నిర్మిస్తున్న సంస్థను అభినందించారు. ఈ సందర్భంగా మన జిందగీ సంస్థ డైరెక్టర్ నగరపు రాజశేఖర్ మాట్లాడుతూ సమాజంలో మార్పు వచ్చేందుకు తమ వంతుగా చిత్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అదే క్రమంలో సమాజహిత చిత్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్ జీవన్, సంస్థ సభ్యులు మహేందర్, రామకృష్ణ, స్వామి, రాజశేఖర్, కడతల సాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment