బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 22 ; బాటసారుల దాహార్తిని తీర్చేందుకు వేసవి కాలం సందర్బంగా రెబ్బెన మండలం గోలేటి బస్టాండ్ వద్ద బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం చలివెంద్రం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవి శంకర్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకై ఎంతో కొంత చేయాలనీ నిర్ణయించుకొని అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్న బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జేబీ పౌడెల్, బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ చారి, ఉపాధ్యక్షులు రవీందర్, ప్రధానకార్యదర్శి అజయ్, సహాయ కార్యదర్శి విజయ్, సభ్యులు తిరుపతి, సతీష్, అరవింద్, తిరుపతి, రవి, శ్రీను, జగన్, తెరాస నాయకులు ఆత్మరామ్ నాయక్, ఎంపీటీసీ సురేందర్, కారోబార్ సుధాకర్, పల్లాస్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment