కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 8 ; మిత్ర సేవ సమితి ఆద్వర్యంలో చలివేంద్రంను ఆదివారం రెబ్బెన మండల కేంద్రం లోని గోలేటి క్రాస్ రోడ్ వద్ద సిఐ పురుషోత్తమ చారి, తహసిల్దార్ సాయన్నలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్వచ్ఛందగ చలివేంద్రం ఏర్పాటు చేసిన మిత్ర సేవా సమితిని సభ్యులను అభినందించారు అనంతరం మాట్లాడుతూ యువత మంచి దారిని ఎంచుకొని సేవ దృక్పథం కలిగి ఉండాలి అన్నారు. యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్,టిబిజికెఎస్ నాయకులు మల్రాజ్ శ్రీనివాస్,ఏఐటీయూసీ నాయకులు ఎస్ తిరుపతి. సేవ సమితి సభ్యులు ముద్దసాని శ్రావణ్,లక్ష్మణ్, రవీందర్,,మనోహర్,మహేందర్,సందీప్,తిరుపతి,వేంకటేష్,మహేష్,ఉపేందర్,రవి యూనియన్ నాయకులు తిరుపతి,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment