Friday, 20 April 2018

బెల్లంపల్లి ఏరియాకు బంగారు భవిష్యత్తు ఉంది : ప్లానింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు

   
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; బెల్లంపల్లి సింగరేణి  ఏరియాకు బంగారు భవిష్యత్  ఉందని  ప్రాజెక్ట్ అండ్  ప్లానింగ్ డైరెక్టర్  భాస్కర్ రావు అన్నారు. గురువారం బెల్లంపల్లి ఏరియా రెబ్బెన మండలం  గోలేటి క్రాస్ రోడ్డు వద్ద  తొంభై రెండు కోట్లతో నూతనంగా  నిర్మించిన సి హెచ్ పి    ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై  శిలా ఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్టుల ద్వారా బొగ్గు  ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు గతంలో నలభై మిలియన్ల టన్నుల బొగ్గును మాత్రమే బెల్లంపల్లి ఏరియా నుండి ఉత్పత్తి చేసేవారన్నారు. ప్రస్తుతం సంవత్సరానికి డెబ్బై మిలియన్ల ముత్తన్నలు బొగ్గుని ఉత్పత్తి చేస్తున్నారన్నారు సింగరేణి ఏరియాలో ప్రత్యేకంగా బెల్లంపల్లి ఏరియా గుర్తింపు తెచ్చుకుందన్నారు ఏరియా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని  సి హెచ్ పి ని నిర్మించడం జరిగిందన్నారు. ఏరియాలో నూతన గనులు రానున్నాయని బొగ్గు ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని సి హెచ్ పి ఏర్పాటు చేసిన్నట్లు పేర్కొన్నారు. సి హెచ్ పి నిర్మాణంతో కాలుష్యాన్ని గణనీయంగా  నివారించడంతో పాటు రోడ్డు మార్గంలో బొగ్గు సరఫరా  సాధ్యమైనంత తగ్గించుకోగలిగామన్నారు వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సకాలంలో చేరవేయడానికి సి హెచ్ పి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్ మాట్లాడుతూ  సి హెచ్ పి ఏర్పాటుతో బొగ్గు రవాణాకు ఎంతో  సులువైన మార్గం అన్నారు ప్రతిరోజు మూడు రేకుల బొగ్గును సరఫరా చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని  సి హెచ్ పి నిర్మాణానికి సహకరించిన రైతులకు, రెవెన్యూ, రైల్వే అధికారులకు కృతజతలు తెలిపారు 2014 ప్రారంభం కావలసిన  సి హెచ్ పి నిర్మాణం పనులు అనివార్య కారణాల వల్ల 2015 ప్రారంభోత్సవం కావడం జరిగిందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి జీఎం  సుభాని,మందమర్రి జీఎం రాఘవులు, రైల్వే ఏవో సురేష్ రెడ్డి ,ప్రాజెక్టు ఆఫీసర్లు కొండయ్య మోహన్ రెడ్డి, శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ కిరణ్ డిజిఎం సీఆర్పీ విశ్వనాథ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు ఎంయు ఇంజినీర్ రామారావు, డివై పిఎం రామశాస్త్రి, అసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ తదతరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment