Monday, 16 April 2018

ఫుట్ బాల్ టోర్నమెంట్ విజేత హైదరాబాద్ నవాబ్ జట్టు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 16 ; బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి భేమన్న స్టేడియంలో 13 వ తేదీ నుండి   జరిగిన వేణుగోపాల్ మెమోరియల్ ఇన్విటేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ చివరి రోజున ముఖ్య అతిధిగా ఇంచార్జి జీఎం  కే కొండయ్య  పాల్గొని విజేతలకు కాష్ ప్రైజ్ మరియు జ్ఞాపికలను అందచేశారు. ఈ పోటీలో హైదరాబాద్ నవాబ్ జట్టు విజేతగా నిలిచింది  ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం 13 టీంలు పాల్గొన్నాయని అన్నారు.ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తే కాకుండా కార్మికులలో క్రీడాసక్తిని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం  పర్సనల్ జె  కిరణ్, ఎస్ ఓ టూ జీఎం  శ్రీనివాస్ ,  మేనేజర్ దొర్లి రాజేశ్వర్, ,టి జి బి కె  ఎస్ నాయకులూ మంగీలాల్, ఉమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment